Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నాటికి 20 కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు రెడీ

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:28 IST)
వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌ను ప్ర‌భుత్వం స‌ర‌ళీక‌రించ‌డంతో దేశీ వ్యాక్సిన్ త‌యారీదారులు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెంచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మే 1 నుంచి 18 ఏండ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డంతో వ్యాక్సిన్ త‌యారీని ముమ్మ‌రం చేయాల‌ని ఫార్మా కంపెనీలు క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి.

జూన్ నాటికి దేశంలో 20 కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండ‌గా ప్రైవేట్ మార్కెట్ లో ఒక్కో వ్యాక్సిన్ డోసు రూ వేయి వ‌ర‌కూ ప‌ల‌క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. త‌యారీ ఊపందుకున్న క్ర‌మంలో జూన్ నుంచి వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాలు పెర‌గ‌నున్నాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో మాట్లాడుతూ ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం పెంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. జూన్ నుంచి సీరం ఇనిస్టిట్యూట్, భార‌త్ బ‌యోటెక్ ల వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాల‌తో పాటు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల దిగుమ‌తులు ఊపందుకుంటాయ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు వ్యాక్సిన్ త‌యారీదారుల‌తో ధ‌ర‌ల‌పై సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కోరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో పోటీకి దీటుగా ఉండేలా ధ‌ర‌లు ఉండాల‌ని వ్యాక్సిన్ త‌యారీదారులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments