Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా ఉగ్రదాడి... ఆత్మాహుతి కాదు.. ఓ యాక్సిడెంటల్ : డిగ్గీరాజా

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (14:32 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని లాథ్‌పురాలో జరిగిన ఉగ్రదాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఓ "యాక్సిడెంటల్" (ప్రమాదం) అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. 
 
అంతేకాకుండా, ఫిబ్రవరి 26వ తేదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోలి జైషే మొహమ్మద్ ఉగ్ర తండాలపై భారత వైమానిక దళం చేపట్టిన వైమానిక దాడులపైనా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు సందేహాలు వ్యక్తం చేశాయనీ... భారత ప్రభుత్వ విశ్వసనీయతపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. 
 
మంగళవారం దిగ్విజయ్ సింగ్ హిందీలో చేసిన ట్వీట్‌లో స్పందిస్తూ, 'ఏదేమైనా, పుల్వామా "దుర్ఘటన" తర్వాత ఐఏఎఫ్ నిర్వహించిన వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు "సందేహాలు" వ్యక్తం చేస్తున్నాయి. ఇది మన భారత ప్రభుత్వ "విశ్వసనీయత"పై’ ప్రశ్నలు లేవనెత్తుతోంది...' అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని 'ప్రమాదం'గా పేర్కొనడాన్ని తప్పుపడుతూ నెటిజన్లు దిగ్విజయ్‌ సింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాకుండా, భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల్లో ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారన్న అంశంపై ఇప్పటివరకు కేంద్రం స్పష్టంచేయలేదని గుర్తుచేసిన డిగ్గీరాజా... '250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామంటూ బీజేపీ చీఫ్ అమిత్‌ షా, 400 మందిని చంపామంటూ యూపీ సీఎం యోగి, ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రమంత్రి అహ్లూవాలియా' చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. 
 
కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది అని ఆయన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ప్రధాని మోడీ డిగ్గీరాజా డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments