కర్నాటక పీఠం కాంగ్రెస్‌ పార్టీదే.. తాజా సర్వేలో వెల్లడి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (15:17 IST)
ఈ నెల పదో తేదీన కర్నాటక అసెంబ్లీకి పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ముందస్తు సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటివరకు  చేసిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుందని వెల్లడించాయి. తాజాగా ఇండియా టు డే - సీ ఓటర్ సంస్థలు కలిసి నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ సర్వే ఫలితాల్లో అధికార బీజేపీకి 74 నుంచి 86 సీట్లు వస్తాయని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 107 నుంచి 119 సీట్ల వరకు వస్తాయని ఈ సర్వే తెలిపింది. 
 
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. అయితే, బీజేపీ గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈ 20 నుంచి 25 సీట్లు తక్కువగా వస్తాయని తెలిపింది. అదేసమయంలో జేడీఎస్ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించి.. 23 నుంచి 35 సీట్లను గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నిరుద్యోగం 31 శాతం, మౌలిక వసతుల కల్పన 24 శాతం, విద్యా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాల కల్పన 14 శాతం, అవినీతి 13 శాతం చొప్పున ప్రభావం చూపే అంశాలుగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments