Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi
, శనివారం, 22 ఏప్రియల్ 2023 (19:33 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సెంట్రల్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసారు. మోదీ ఇంటి పేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసులో రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
 
ఎంపీగా సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో నెల రోజుల్లోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్‌కు లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే, నోటీసులో పేర్కొన్న చివరి రోజైన ఈరోజు ఆయన బంగ్లాను ఖాళీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలోని గచ్చిబౌలిలో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం