Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : బీజేపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు... ఓట్లు శాతం మాత్రం పదిలం...

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (10:11 IST)
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. కానీ, ఆ పార్టీ ఓటింగ్ శాతం మాత్రం పదిలంగా ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 300కు పైగా స్థానాల్లో గెలుస్తుందని, ఎన్డీయే కూటమి ఏకంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
 
ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390 - 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ మార్కు కంటే 21 సీట్లు అధికంగా ఎన్డీయే 293 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీకి 240 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 
 
గత ఎన్నికల్లో కమలం పార్టీకి 37.37 శాతం ఓట్లు రాగా ఈసారి 37.34 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగానూ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.49 శాతం ఓట్లు రాగా ఈసారి 22.34 శాతం ఓట్లు సాధించింది. ఇక ఇండియా కూటమికి సుమారు 42 శాతం ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్డీయే చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments