Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా ఆశీర్వాదం పొందడంలో ఫెయిల్ అయ్యాం : కాంగ్రెస్

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (07:31 IST)
తాము ప్రజా ఆశీర్వాదం పొందడంలో పూర్తిగా విఫలమైనట్టు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 403 స్థానాలు ఉన్న యూపీలో కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితమైంది. 
 
అంతేకాకుండా అంతర్గత కుమ్ములాటలు కారణంగా పంజాబ్‌లో అధికారానికి దూరమైంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గెలుస్తామన్న ఆశలు అడియాశలయ్యాయి. ఈశాన్య రా
ష్ట్రమైన మణిపూర్‌లో కాషాయం జెండా ఎగిరింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగింటిలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అఖండ విజయాలను సొంతం చేసుకున్నాయి. 
 
ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పందిస్తూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. 
 
తమ అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజా ఆశీర్వాదం పొందడంలో తాము పూర్తిగా విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. ఈ ఫలితాలపై చర్చించేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సూర్జేవాలా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments