Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు సీరియస్: రిజర్వ్‌లో తీర్పు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (23:26 IST)
vijay mallya
వ్యక్తిగతంగా హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా రెండు వారాల్లో హాజరు కావాలని విజయ్ మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. 
 
వ్యక్తిగతంగా, లేకపోతే న్యాయవాది అయినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్టు పేర్కొంది.
 
కాగా.. బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోవడం తెలిసిందే. అయితే, రుణ ఎగవేతలపై న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో మాల్యాపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదయ్యాయి. 
 
బుధవారం అమికస్ క్యూరీ పనుల ఒత్తిడిలో ఉండడంతో, ఈ కేసు నేటికి వాయిదా పడింది. నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments