Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (09:52 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు శిక్షను అనుభవిస్తుందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈడీని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఒరిస్సా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ఈడీ పనితీరుపై స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈడీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. పైగా, ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేయడానికి ఇతర ఏజెన్సీలు అనేకం ఉన్నాయని అందువల్ల ఈడీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
నేషనర్ హెరాల్డ్ నిధులు దుర్వినియోగం కేసులో ఏ1గా సోనియా గాంధీ, ఏ2గా రాహుల్ గాంధీల పేర్లను ఈడీ చేర్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాయంటూ యూపీలోని బీజేపీ, కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఒరిస్సా ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments