Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్ - ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:03 IST)
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు జారీ చేసిన సమయంలో రాహుల్ విదేశాల్లో ఉన్నారు. ఇపుడు స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధించనున్నారు. నిజానికి ఈ నెల 2వ తేదీన రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సివుంది. కానీ, విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. 
 
కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత పవన్ బన్సల్‌ను విచారించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments