Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రహిత భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (13:33 IST)
భారత్‌లో అత్యవసర వినియోగం కింద కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేలా కోవాగ్జిన్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ప్ర‌ధాని నరేంద్ర మోడీ స్పందించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ల‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు డీసీజీఐ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల భార‌తీయుల‌ను గ‌ర్వించేలా చేస్తుందన్నారు. 
 
ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ క‌ల‌ను నిజం చేసేలా మ‌న శాస్త్ర‌వేత్త‌లు, స‌మాజం ఎంతగా ఆత్రుత‌గా ఉందో ఇది తెలుపుతోందన్నారు. దేశంలో క‌రోనా నేప‌థ్యంలో  కీల‌క ముంద‌డుగు ప‌డిందన్నారు. క‌రోనా నేప‌థ్యంలో పోరాడిన‌ వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్ర‌వేత్త‌లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు క‌రోనా వారియ‌ర్లంద‌రికీ మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని పేర్కొన్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల భారత్ కోవిడ్ రహితం కాబోతోందన్నారు. రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని చెప్పుకొచ్చారు. కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్‌ను అభినందిస్తూ, భారతీయులందరికీ అభినందనలు తెలిపారు. 
 
స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయాత్మక మలుపుగా ఈ పరిణామాలను అభివర్ణించారు. సీరమ్ ఇండియా, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని, దీంతో ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు.
 
అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం ప్రతి భారతీయునికి గర్వకారణమని మోడీ పేర్కొన్నారు. దీనినిబట్టి స్వయం సమృద్ధ భారత దేశం కోసం కంటున్నకలలను నిజం చేయడానికి మన శాస్త్రవేత్తలు ఎంత ఆత్రుతపడుతున్నారో తెలుస్తోందని తెలిపారు. స్వయం సమృద్ధ భారత్‌ మూలాలు దయతో వ్యవహరించడం, అందరినీ సంరక్షించడం అని పేర్కొన్నారు. 
 
కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం లభించింది. వీటి పరిమిత వినియోగానికి అనుమతించినట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమని తెలిపారు. 
 
దేశంలో క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను వైద్యులు కాపాడ‌ర‌ని చెప్పారు. డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన ఈ రెండు టీకాలు భార‌త్‌ను క‌రోనా ర‌హిత దేశంగా మార్చేందుకు తోడ్ప‌డుతాయ‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments