Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్టుల నిర్మాణాల‌ను వేగ‌వంతంగా పూర్తి చేయండి: ప్రధాని

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:59 IST)
ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం (వీసీ) నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు, పెట్రోలియం పైపులైను ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్‌లను ఆదేశించారు.

ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూములు సేకరించి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టమ్ కింద వివిధ పోలీస్ రికార్డులన్నీ కంప్యూటరీకరణ, పోలీస్ సేవలన్నీఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంపైన వివిధ రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడి మార్గనిర్దేశం చేశారు.

అంతకు ముందు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రగతి అంశానికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం మీదుగా వెళుతున్నపారాదీప్-హైదరాబాద్ పెట్రోలియం పైపులైను నిర్మాణ పనులకు భూసేకరణ, రాష్ట్రం మీదుగా వెళుతున్న బళ్ళారి-బయరాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టమ్ అంశాలకు సంబంధించిన ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ నీలం సాహ్నితో సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ రాష్ట్రం మీదుగా వెళుతున్నబళ్ళారి-బయరాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనుల ప్రగతిని ప్రధానికి వివరించారు. అలాగే ఏపీ మీదుగా వెళుతున్న పారాదీప్-హైదరాబాదు పెట్రోలియం పైపులైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సంబంధించిన ప్రగతిని వివరించారు.

వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments