Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రేమ.. తల్లిపై దాడి చేసి.. పారిపోవాలనుకుంది.. కానీ జైలుకే వెళ్లింది?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (14:34 IST)
ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషనైపోయింది. ఒకరిని ఒకరు చూసుకోకుండానే ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా ప్రేమించి.. ఆపై వివాహం చేసుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇందులో కొన్ని ప్రేమలు సక్సెస్ అవుతున్నా... మరికొన్ని ప్రేమాయణాలు మాత్రం చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువళ్లూరు జిల్లాకు సమీపంలో కళాశాల విద్యార్థిని దేవిప్రియ అనే యువతి ఫేస్‌బుక్ ద్వారా వివేక్ అనే యువకునితో చాటింగ్ చేసింది. ఆ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ ప్రేమకు దేవిప్రియ తల్లి అడ్డుపడింది. అయితే ఒక దశలో ఇంటి నుంచి పారిపోవాలని దేవిప్రియ ప్రయత్నించింది. దాన్ని అడ్డుకోవాలని చూసిన తల్లిపై దాడి చేసింది. 
 
ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం కన్నతల్లిపై దాడి చేసి ప్రేమికుడి స్నేహితులతో పారిపోవాలనుకుంది. కానీ స్థానికులు దేవిప్రియ, ఆమె ప్రేమికుడి స్నేహితులను చావబాదారు. ఇంకా దేవిప్రియ తల్లిని ఆస్పత్రికి తరలించారు. కానీ దేవీప్రియ తల్లి తీవ్రగాయాల కారణంగా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు చూడని ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం.. కన్నతల్లిని కడతేర్చిన దేవిప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments