Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలి తీవ్రత: కాన్పూర్‌లో ఒక్కరోజే 25మంది మృతి

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (11:00 IST)
ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత కారణంగా ఒక్క కాన్పూర్ ప్రాంతంలోనే ఒక్కరోజే 25 మంది చనిపోయారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా మంచు కురుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన చలి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 
 
ఈ పరిస్థితిలో రోడ్డుపక్కన నివాసముంటున్న నిరాశ్రయులకు శాశ్వత నివాసం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, చాలా ప్రాంతాల్లో ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. 
 
నోయిడా, ఘజియాబాద్, అయోధ్య, కాన్పూర్, లక్నో, బరేలీ, మొరాదాబాద్‌లలో పగటిపూట కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలో కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
 
ఉత్తరప్రదేశ్‌లో చలి రోజురోజుకు పెరుగుతుండటంతో కాన్పూర్‌లో గురువారం (5వ తేదీ) గుండెపోటు, పక్షవాతం కారణంగా 25 మంది మరణించారు. వీరిలో 17 మంది వైద్యం అందక ముందే మృతి చెందినట్లు సమాచారం. విపరీతమైన చలి వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటుతో చనిపోతారని, రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments