Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై కారు బాంబు పేలుడు.. తమిళనాడులో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (13:25 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, గురువారం ఎన్.ఐ.ఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గత నెల 23వ తేదీన కోయంబత్తూరు నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. కొట్టాయ్ ఈశ్వర్ ఆలయం ముందు భాగంలో ఈ పేలుడు జరిగి జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. 
దీనిపై ఎన్.ఐ.ఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సో విభాగం దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, తమిళనాడు పోలీసులు త్వరితగతిన స్పందించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పుదుపేట, మన్నాడు, జమాలియా, పెరంబూరు, కోయంబత్తూరులోని కొట్టైమేడు, ఉక్కడంతో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments