Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె శ‌వ పేటిక చుట్టూ మూడు సార్లు తిరిగిన జ‌య‌ల‌లిత‌

Advertiesment
Jayalalithaa
, గురువారం, 27 అక్టోబరు 2022 (11:38 IST)
Jayalalithaa
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గురించి తెలియందికాదు. ఆమె సున్నిత మ‌న‌స్కురాలు. అలాంటి భావాలున్న మ‌రో న‌టి సూర్య‌కాంతం. అందుకే ఆమె అంటే అంత ప్రేమ‌. సూర్య‌కాంతంకు సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్థల శిరోమణి అని బిరుదులున్నాయి. ఆమె గురించి ఓ సంద‌ర్భంలో  గుమ్మడి వెంకటేశ్వరరావు ఏమ‌న్నారంటే - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావుష అని తెలిపారు.
 
webdunia
Suryakantham
సూర్య‌కాంతం వెంకట కృష్ణరాయపురంలో  28 అక్టోబర్, 1924న పుట్టింది. రేపు ఆమె జ‌యంతి.  18 డిసెంబర్, 1994న చెన్నైలో మ‌ర‌ణించింది. సూర్య‌కాంతం త‌ల్లి వెంకట రత్నమ్మగారు జయ‌ల‌లిత‌కు మంచి స్నేహితురాలు కూడా. సూర్య‌కాంతం మ‌ర‌ణం సంద‌ర్భంగా ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. అది ఏమిటంటే,
 
తమిళనాడు రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులతో ముఖ్య మంత్రి  సమావేశం జరుగుతుంది.  ముఖ్యమంత్రి  కార్యదర్శి వచ్చి ఆమె చెవిలో చిన్నగా ఏమో చెప్పారు. ఆమె లేచి నిలబడి నమస్కరించి,  అతిథిల‌తో, ముఖ్యమైన వ్యక్తిగత విషయం పై పోతున్నాను. మరో 45 నిముషాల్లో వస్తాను. ఈ లోగా మీరు మా ఆతిధ్యాన్ని  స్వీకరించండి అని వేగంగా వెళ్లి కారు ఎక్కింది. 
 
15 నిముషాల్లో కారు ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే కొంత మంది అక్కడ వున్నారు. కారు దిగి ఇంట్లోకి నడిచింది. ఎదురుగా శవ పేటిక వుంది. చేతులు జోడించి   శవ పేటిక చుట్టూ మూడు సార్లు తిరిగింది. సెక్రటరీ అందించిన పుష్పగుచ్ఛాన్నిఅక్కడ ఉంచి, నమస్కారం చేసింది. ఆమె కంటి నుంచి కారుతున్న బాష్పాలను తుడుచుకుంది. సెక్రటరీ నివ్వెరపోయాడు. ఆమె జీవితం లో ఎన్నో కష్టాలను చూసింది. ఘోర అవమానాలు పొందింది. ఎప్పుడు కన్నీరు పెట్టింది లేదు. అలాటిది ఆమె కంటి నీరు  చూసింది తొలిసారి, తిరిగి కారు ఎక్కిన ఆమెను అడిగాడు సెక్రటరీ ఆమె ఎవరు మేడం అని. 
 
ప్రేమగా, ఆప్యాయం తో అన్నం పెట్టి , ఆకలి తీర్చిన అమ్మ సూర్యకాంతమ్మ అని ఒక మహా నటి.  సినిమా షూటింగ్ కు వచ్చినప్పుడు రకరకాల వంటలు చేసి, కెరియర్ లో తెచ్చి సహనటులందరికి కొసరి కొసరి వడ్డించి , తినిపించేది.  ఆమె చేసినా పులిహార, మసాల వడలు అంటే నాకు చాల ఇష్టం. స్టూడియో లో ఆమె షూటింగ్ జరుగుతుందని తెలిస్తే చాలు , వేరే ఫ్లోర్ లో పనిచేస్తున్న నేను భోజనానికి ఆమె దగ్గర చేరిదానిని. మా అమ్మ తరువాత అమ్మ వంటిది  అని అన్నది. ఎంత మంచి మనసు. అందుకనేమో తమిళ ప్రజలు ఆమెను అమ్మా  అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆ మంచితనం వల్లే, ఆమె లేకపోయినా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇదేనేమో చనిపోయినా బ్రతికి ఉండడం అంటే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రోలర్స్‌కు చెక్ పెట్టిన ప్రియమణి.. "మిస్ యు ముస్తఫా రాజ్" అంటూ లవ్‌సింబల్