Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకృష్ణ ఆశ్రమంలో అమానుష చర్య : పెన్ను దొంగిలించాడని థర్డ్ క్లాస్ బాలుడిని చితకబాదారు...

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (10:45 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో ఉన్న రామకృష్ణ ఆశ్రయంలో అమానుష చర్య జరిగింది. పెన్ను దొంగిలించాడన్న అనుమానంతో మూడో తరగతి చదువుతున్న బాలుడుని చితకబాదారు. ఆశ్రమ మేనేజర్, ఆయన ఇద్దరు సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
మూడేళ్ల బాధిత బాలుడి పేరు తరుణ్ కుమార్. రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఆయన సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 'ఇద్దరు అబ్బాయిలు, టీచర్ కొట్టారు. కర్రతో కొట్టినప్పుడు అది విరిగిపోయింది. అప్పుడు బ్యాట్‌తో కొట్టారు. శరీరంపై గాయాలు కూడా చేశారు. ఆ తర్వాత యాద్గిర్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద అడుక్కోమన్నారు. కానీ, ఎవరూ డబ్బులు ఇవ్వలేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పెన్ను కోసమే తనను కొట్టారని పేర్కొన్నాడు.
 
దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లు పూర్తిగా ఉబ్బిపోయాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆశ్రమంలో వేశారు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పెన్నును దొంగిలించాడు. ఈ విషయాన్ని వారు ఆశ్రమ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోపంతో ఊగిపోయిన వేణుగోపాల్, మరో ఇద్దరు కలిసి తరుణ్ పై దారుణంగా దాడిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments