Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి వేదికపైనే వధువుకు ముద్దు పెట్టిన వరుడు... దాడులు చేసుకున్న దాయాదులు

bride kiss

ఠాగూర్

, శుక్రవారం, 24 మే 2024 (09:59 IST)
పెళ్లి వేదికపైనే వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. తనకు కాబోయే భార్యకు పెళ్లి కుమారుడు ముద్దు పెట్టడాన్ని వధువు బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. వధువుకు ఇష్టం లేకపోయినా వరుడు ముద్దు పెట్టాడంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ కాస్త పెరిగి పెద్ద వివాదంగా మారింది. చివరకు ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్‌లో సోమవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
యూపీకి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌ నగర్‌లో ఒకే రోజు ఏర్పాటుచేశారు. ఒక కుమార్తె వివాహం పూర్తయ్యాక రెండో కుమార్తె వివాహాన్ని ప్రారంభించారు. అయితే, వధువు మెడలో వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువు బహిరంగంగా ముద్దుపెట్టాడు. ఇది ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. వధువు, బంధువులను వరుడు, అతడి కుటుంబ సభ్యులపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో వరుడి తరపు వారు కూడా ప్రతిదాడికి దిగారు. 
 
ఈ ఘర్షణలో ఏకంగా ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, తమ కుమార్తెకు ఇష్టం లేకపోయినా అందరి ముందు ముద్దు పెట్టాడని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వధువు అనుమతి తీసుకున్నాకే ముద్దు పెట్టాడని వరుడు చెప్పాడు. అయితే, ఈ ఘటన పోలీస్ స్టేషన్‌కు చేరినప్పటికీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీనికి కారణం.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఏపీకి చెందిన బీలం అచ్యుత్ మృతి