ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్న బాలుడు.. చంపేసిన కిరాతకుడు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:55 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు ఓ బాలుడిని అత్యంత కిరాతకంగా సమీప బంధువే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగస్టు నెల 30వ తేదీ సాయంత్రం తిరువనంతపురంలోని పూవాచల్ ప్రాంతంలో ఓ హత్య జరిగింది. సైకిలుపై బయటకు వెళ్లామనుకున్న శేఖర్ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. ఆ సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
 
అయితే, కొందరు బంధువుల ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయడాన్ని చూసిన శేఖర్.. అతన్ని నిలదీశాడు. ఆలయం వద్ద మూత్రం విసర్జించరాదంటూ మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ప్రియరంజన్... ఈ హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియరంజన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments