Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాస్ యాత్ర... మానస్ సరోవర్‌లో స్నానానికి చైనా అడ్డుకుంటుందట... కానీ...

కైలాస్ మానస సరోవర్ యాత్ర అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వున్న హిమాలయ ప్రాంతం. కైలాస్ మానస్ సరోవర్లో పుణ్య స్నానాలు చేయాలంటే టిబెట్ నుంచి చైనా ద్వారా వెళ్లి అక్కడ స్నానాలు చేయాల్సి వుంటుంది. ఐతే తాజాగా మానస సరోవరంలో పుణ్య స్నానాలు చేసేందుకు చైనా

Webdunia
సోమవారం, 28 మే 2018 (19:51 IST)
కైలాస్ మానస సరోవర్ యాత్ర అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వున్న హిమాలయ ప్రాంతం. కైలాస్ మానస్ సరోవర్లో పుణ్య స్నానాలు చేయాలంటే టిబెట్ నుంచి చైనా ద్వారా వెళ్లి అక్కడ స్నానాలు చేయాల్సి వుంటుంది. ఐతే తాజాగా మానస సరోవరంలో పుణ్య స్నానాలు చేసేందుకు చైనా అడ్డుకుంటోందంటూ వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి భారతదేశం నుంచి వెళ్లిన భక్తుల బృందానికి నాయకత్వం వహించిన సంజీవ్ ఠాకూర్ అనే పురోహితుడు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. 
 
తమను సరోవరంలో పుణ్య స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. పుణ్య స్నానాలకు అనుమతి లేనప్పుడు తమకు వీసాలు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తనతో పాటు 80 మంది భక్తులున్నారనీ, తామంతా ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేంత వరకూ కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఐతే దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోలా స్పందించారు. 
 
కైలాస్ మానస సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకించి కొన్ని నిర్దుష్ట ప్రాంతాలు వుంటాయనీ, భక్తులు అక్కడ మాత్రమే స్నానమాచరించాలని తెలియజెప్పారు. ఎక్కడబడితే అక్కడ పుణ్య స్నానాలు చేయాలంటే వీలుకాదని ఆమె వివరించారు. మరి అక్కడికెళ్లిన భక్తుల బృందం నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఎక్కడబడితే అక్కడ చేయాలని అనుకుంటున్నారా?

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments