Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మసీదులపై జాతీయ జెండాను ఎగురవేయండి- పాకిస్థాన్‌కు బీఎస్ఎఫ్ గుణపాఠం

దేశంలో ఇస్లాం మతం, ఇస్లాం భావజాలం వ్యాప్తి చెందకుండా వుండేందుకు చైనా సర్కారు కీలక చర్యలకు ఉపక్రమించింది. మసీదులు, మత ప్రచారాలపై చైనా ఆంక్షలను విధించింది. గతవారం రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో చైనా ప

మసీదులపై జాతీయ జెండాను ఎగురవేయండి- పాకిస్థాన్‌కు బీఎస్ఎఫ్ గుణపాఠం
, మంగళవారం, 22 మే 2018 (14:44 IST)
దేశంలో ఇస్లాం మతం, ఇస్లాం భావజాలం వ్యాప్తి చెందకుండా వుండేందుకు చైనా సర్కారు కీలక చర్యలకు ఉపక్రమించింది. మసీదులు, మత ప్రచారాలపై చైనా ఆంక్షలను విధించింది. గతవారం రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ మేరకు ఆంక్షలు విధించింది. దేశంలోని ముస్లింలంతా దేశభక్తి చాటుకోవాలని.. తప్పనిసరిగా మసీదులపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించింది. 
 
నింగ్సియా, బీజింగ్, జిన్ జియాంగ్, క్వింఘై, గాన్సూ అనే ఐదు ప్రాంతాల్లో మాత్రమే మత ప్రచారాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మసీదులపై జాతీయ జెండాలను ఎగురవేయడం ద్వారా ముస్లింలలో దేశభక్తి పెరుగుతుందని ఇస్లామిక్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది. అయితే దేశంలో మస్లాం మతవ్యాప్తిని అడ్డుకునేందుకే సర్కాలు ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించే పాకిస్థాన్‌కు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరపవద్దని పాకిస్థాన్ సైనికులు ప్రాధేయపడినట్లు సైనికులు తెలిపారు. 
 
ఇటీవల జమ్మూ-కశ్మీరులో కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు ఆగడం లేదు. భారతదేశానికి చెందిన సామాన్య ప్రజలపై కూడా కాల్పులు జరుపుతున్నారు. దీంతో సరిహద్దుల వెంబడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ దళాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరుపుతున్న కాల్పులకు ప్రతీకారంగా పాకిస్థాన్ పికెట్‌ను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. 19 సెకండ్ల నివిడి కల ఈ వీడియోలో పాకిస్థాన్ పికెట్ పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నిపా సోకింది.. కొన్ని గంటల్లో చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త'... కన్నీరు తెప్పిస్తున్న నర్సు లేఖ