ప్రియురాలిని చూసేందుకు వెళ్ళాడు. అయితే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, చిదంబరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిదంబరం అరంగనాథన్ వీధిలో ఉన్న బాబు కుమార్తె శ్వేతతో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డాడు.
అయితే ఈ ప్రేమికుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. అయితే శ్వేత కుటుంబీకులు తీవ్రంగా మందలించి పంపించారు. కానీ శుక్రవారం సాయంత్రం ప్రియురాలి ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో శ్వేత కోసం వెళ్లి మళ్ళీ బుక్కైయ్యాడు. దీంతో అతడి ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు కలిసి అతడిని పట్టుకుని నరికి చంపారు. దీంతో అక్కడికక్కడే అన్భళగన్ ప్రాణాలు కోల్పోయాడు.
తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని చంపామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసును ప్రేమ పరువు హత్యగా గుర్తించారు.