Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్మా జిల్లాలో విద్యార్థిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (09:03 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఒక విద్యార్థినితో పాటు మొత్తం ఐదుగురిని అపహరించారు. సుక్మా జిల్లాలోని కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. 
 
ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. కాగా, వారిని ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారని వెల్లడించారు.
 
కొన్నిసార్లు సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని చెప్పారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్‌ రీజియన్‌లోని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయన్నారు. గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మందిని ఎత్తుకెళ్లారని, రెండు మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని శర్మ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments