Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌యూలో నోరెత్తని దీపికా పదుకునే.. సినిమాలను బహిష్కరించాలని..?! (video)

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (11:21 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. జేఎన్‌యూకి వెళ్లిన దీపిక దాదాపు 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపారు. కానీ ఏమాత్రం నోరు విప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీపిక వర్సిటీని సందర్శించిన సమయంలో జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
 
మంగళవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె యూనివర్సిటీకి వచ్చారు. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను ఆమె పరామర్శించారు. ఆ తర్వాత మరి కొంతమంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు. 
 
కాగా, ఆదివారం సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జేఎన్‌యూ ప్రవేశించి.. పలువురు విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లపైనా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments