Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి చేసుకోమని ఇంటికెళ్ళి అడిగాడు.. పొమ్మంది.. కత్తితో?

ఫేస్ బుక్ పరిచయం ఆ యువకుడిని ప్రేమోన్మాదిగా మార్చింది. ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ మహిళను ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటన చెన్నై రాయపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయపురంకు చెందిన సైఫుల్లా (

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (13:53 IST)
ఫేస్ బుక్ పరిచయం ఆ యువకుడిని ప్రేమోన్మాదిగా మార్చింది. ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ మహిళను ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటన చెన్నై రాయపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయపురంకు చెందిన సైఫుల్లా (28) 10వ తరగతి వరకు చదువుకొని జులాయిగా తిరుగుతున్నాడు. ఇటీవల ఇతనికి ఫేస్ బుక్ ద్వారా అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. 
 
బీఏ పట్టభద్రురాలైన ఆమెతో ఏర్పడిన ఫేస్‌బుక్‌ పరిచయాన్ని సైఫుల్లా ప్రేమగా మార్చేశాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అంతే చిరునామా తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికే వెళ్లిపోయాడు. అయితే తన తల్లిదండ్రులకు ఇదంతా తెలిస్తే గొడవలవుతాయని ఆమె సైఫుల్లాను పొమ్మంది. 
 
వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సైఫుల్లాను ఆ యువతి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సైఫుల్లా కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. ఆమె కేకలు విన్న ఆమె సోదరి కూడా అతన్ని అడ్డుకోవడానికి యత్నిచండంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఇంతలో స్థానికులు సైఫుల్లాను పట్టుకున్నారు. ఈ ఘటనలో  సైఫుల్లాను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments