Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు : జైట్లీ కరుణతో పన్నుశాతం తగ్గిన వస్తువులివే

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) విధానం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జీఎస్టీకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఈ విధానం అమల్లోకి వస్తే

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (12:30 IST)
వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) విధానం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జీఎస్టీకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఈ విధానం అమల్లోకి వస్తే అనేక ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు వినతులు వెళ్లాయి. వీటిని పరిశీంచిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొన్ని వస్తువుల ధరలు తగ్గించారు. 
 
జీడిపప్పుపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే, ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12, అగర్‌బత్తీలపై 12 నుంచి 5, డెంటల్‌ వాక్స్‌ 28 నుంచి 8, ఇన్సులిన్‌ 12 నుంచి 5, ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18, స్కూల్‌ బ్యాగ్స్‌ 28 నుంచి 18, ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌ 18 నుంచి 12, కలరింగ్‌ బుక్స్‌ 12 నుంచి 0, ప్రీకాస్ట్‌ కాన్సన్‌ట్రేట్‌ పైపులు 28 నుంచి 18, స్పూన్లు, ఫోర్క్‌లు (కట్లరీ) 18 నుంచి 12, ట్రాక్టరు విడిభాగాలపై 28 నుంచి 18, కంప్యూటర్‌ ప్రింటర్లపై 28 నుంచి 18 సినిమాపై మధ్యేమార్గంగా.. సినిమాలపై 28 శాతం పన్ను విధించడంతో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. 
 
అలాగే, రూ.100 కంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది. చాలా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన భాషల్లో తీసిన సినిమాకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి కేంద్రం నుంచి ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇంటి వద్దనే చేసే వస్త్ర పరిశ్రమ, వజ్రాల ప్రాసెసింగ్‌ వంటి వారు చెల్లించాల్సిన మొత్తాన్ని 18 శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఈ రంగాల్లోని ఆయా పరిశ్రమలపై కూడా పన్ను తగ్గించడమే దీనికి కారణం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments