Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో సీఏఏకు వ్యతిరేకంగా రాత్రి పూట ఆందోళనలు.. పోలీసుల లాఠీఛార్జ్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (11:04 IST)
CAA
దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకా తమిళనాడులోని చెన్నైలోనూ సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. 
 
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా... చెన్నైలోని అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు ప్రజలు. ఐతే వాళ్లను నిలువరించే క్రమంలో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలైనాయి. ఇక పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఛార్జ్‌లో చాలా మంది గాయాలపాలయ్యారు. పోలీసుల చర్యతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. 
 
తమిళనాడులోని చాలా నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సాగాయి. వాటిలో ఎక్కువగా ముస్లింలు పాల్గొన్నారు. ముఖ్యంగా అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. మధురై, కోయంబత్తూర్, తిరుచ్చి జిల్లాలు ఆందోళనలతో హోరెత్తాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు నిరసన గళం వినిపించారు. 
 
ఆందోళనలు జరిపిస్తున్న వారితో చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథ్ మీటింగ్ పెట్టారు. ఫిర్యాదులు స్వీకరించారు. ఐతే... ఉత్తర చెన్నైలోని వాషర్‌మ్యాన్‌పేట్ కొంతమంది ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ అనుమతి లేకుండా ఆందోళనలు చేశారని పోలీసులు చెప్తున్నారు. 
 
రాత్రంతా ఆందోళనలు జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంకా లాఠీఛార్జ్ కొందరు ముస్లిం ప్రజలు గాయాల పాలయ్యారు. అయితే ముస్లిం ప్రజలకు పోలీసులకు మధ్య సయోధ్య కుదిరిందని.. అరెస్టయిన వారిని విడుదల చేసేందుకు పోలీసులు ఒప్పుకున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments