Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్రీమోనీ రోమియో.. పెళ్లిపేరిట మోసం.. కోట్లు గుంజేశాడు..

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (16:04 IST)
ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఆన్‌లైన్ మోసాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో మోసం చేసి.. పలు కోట్ల రూపాయలను మోసం చేసిన మాట్రీమోనీ రోమియోను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. గత 2016వ సంవత్సరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారికి చక్రవర్తి అనే యువకుడు.. మ్యాట్రీమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు. తాను ఓ వైద్యుడిని అని.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. దీన్ని నమ్మిన ఆ మహిళా ఉద్యోగి అతనితో ఏర్పడిన పరిచయాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చింది. భారత్ వస్తే కలుస్తానని నమ్మబలికిన చక్రవర్తి.. చెప్పినట్లే చేశాడు. 
 
ఇంకా ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికి.. తన తల్లి మరణించిందని.. అందుకని ఏడాది తర్వాత వివాహం వుంటుందని చెప్పాడు. అంతటితో ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. ఇందుకు కాస్త డబ్బు అవసరమన్నాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ తాను వివాహం చేసుకునే వ్యక్తే కదాని ఆరు కోట్ల రూపాయలను వ్యాపారం కోసం ఇచ్చింది. 
 
కానీ డబ్బు చేతికి అందడంతోనే అదృశ్యమయ్యాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతడు తమిళనాడు, తిరువణ్ణామలైకి చెందినవాడని తెలిసింది. ఇంకా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా మహిళలతో స్నేహం చేస్తాడు. 
 
ఆపై వారిని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. పెళ్లి పేరిట మోసం చేసేవాడు. ఇలా తొమ్మిది మంది మహిళలను మోసం చేసి రూ.9కోట్ల వరకు గుంజేశాడని తేలింది. ఇక చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసి తిరుచ్చి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments