Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనుబాలు తాగేటప్పుడు నొప్పి... మగబిడ్డను చంపేసిన తల్లి.. ఎక్కడ?

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆపై పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో కానీ.. తన కన్నబిడ్డను ఆ తల్లి బావిలో వేసి హతమార్చింది. ఈ ఘటన చెన్నై వేళచ్చేరిలో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (12:01 IST)
ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆపై పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో కానీ.. తన కన్నబిడ్డను ఆ తల్లి బావిలో వేసి హతమార్చింది. ఈ ఘటన చెన్నై వేళచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేళచ్చేరికి చెందిన వెంకన్న (30), ఉమా (27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలకు ముందు ఉమకు పండంటి మగబిడ్డ పుట్టాడు. 
 
అయితే శుక్రవారం రాత్రి భార్యాభర్తలు బిడ్డను పక్కనబెట్టుకుని నిద్రపోగా, శనివారం వేకువజామున ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉదయం నిద్రలేచిన భార్యాభర్తలు చూస్తే మగబిడ్డ కనిపించలేదు. దీంతో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో అసలు విషయం తేల్చారు. 
 
కన్నబిడ్డను ఉమానే హతమార్చి కిడ్నాప్ డ్రామా చేసిందని కనుగొన్నారు. ఇంకా ఉమా వద్ద జరిపిన విచారణలో కూడా ఆమే తన బిడ్డను చంపేసినట్లు అంగీకరించింది. కానీ బిడ్డను చంపినందుకు అసలు కారణం మాత్రం పోలీసులకు షాక్‌నిచ్చింది. 
 
తొలికాన్పులో మగబిడ్డ పుట్టినందుకు సంతోషించాల్సిపోయి.. ఆ బిడ్డ చనుబాలు తాగేటప్పుడు రొమ్ములో తీవ్రమైన నొప్పి రావడం వల్లే హత్యచేసి, ప్లాస్టిక్ సంచిలో కట్టి పాడుబడిన బావిలో విసిరేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. దీన్ని విన్న పోలీసులు షాక్ అయ్యారు. కానీ ఆమె మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు భావిస్తున్నారు. ఉమా మానసిక రోగిగా వుండచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments