Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు అడ్డుగా వుందని ఎంత పనిచేశాడు.. చెన్నైలో దారుణం

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:11 IST)
ప్రేమకు అడ్డు చెప్పిందని.. ప్రేమించిన ప్రియురాలితో వివాహం జరపలేదన్న కోపంతో మె తల్లిని సజీవ దహనం చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుడి ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట, అనంతనాయగినగర్‌లో నివసించే వెంకటమ్మ (50), వెంకటేశన్‌ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. వెంకటేశన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల క్రితం మరణించాడు, దీంతో కారుణ్య నియామకాల కోటాలో రజితకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. 
 
అదే ప్రాంతానికి చెందిన భూపాలన్‌ కుమారుడు సతీష్‌ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్దతిన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రజితకు ఉద్యోగం రాక ముందు నుంచే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. రజితకు కూడా చెన్నై కార్పోరేషన్‌లో ఉద్యోగం రావటంతో వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మరింత బలపడింది. ఈ క్రమంలో రజితను ఇచ్చి పెళ్లి చేయమని సతీష్ వెంకటమ్మను అడిగాడు. వెంకటమ్మ అందుకు అంగీకరించకపోగా…అదే ప్రాంతానికి చెందిన వేరోక యువకుడితో రజితకు పెళ్లి చేసేందుకు గతవారం నిశ్చితార్ధం జరిపించింది.
 
దీంతో సతీష్ గురువారం రాత్రి వెంకటమ్మ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనతోపాటు తీసుకెళ్లిన పెట్రోల్ న వెంకటమ్మ, రజితలపైన పోసి నిప్పింటించాడు. తాను వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురూ సజీవ దహనమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments