Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిటికల్ కండిషన్‌లో కరుణానిధి.. ఈపీఎస్ - ఓపీఎస్ పరామర్శ.. చెన్నైలో హైఅలెర్ట్

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్

Webdunia
సోమవారం, 30 జులై 2018 (11:24 IST)
డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, రాష్ట్ర మంత్రులు సోమవారం పరామర్శించారు.
 
వారంతా కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రికి చేరుకున్న వారిద్దరూ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడారు. కరుణానిధికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు కరుణానిధిని పరామర్శించారు. 
 
మరోవైపు కరుణానిధి ఆరోగ్యంపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ కంగారుపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కావేరీ ఆస్పత్రి పరిసరాల్లో ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించింది. సుమారు 3 వేల మంది పోలీసులు ఆస్పత్రి, డీఎంకే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తక్షణం రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, చెన్నై నగర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments