Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీని నిరూపించుకున్న ఆటో డ్రైవర్.. 50 సవర్ల బంగారాన్ని ఏం చేశాడంటే?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (21:46 IST)
ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. అతని పేరు శరవణకుమార్. తన ఆటో ఎక్కి బంగారు సంచిని మర్చిపోయి వెళ్లిపోయిన ప్యాసింజర్‌కు తిరిగి ఆ బంగారం బ్యాగును తిరిగి అప్పగించేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై క్రోంపేట సమీపంలో ఆటో నడిపే శరవణకుమార్ ఆటోను గురువారం (జనవరి 28)న క్రోంపేటకు చెందిన ఆల్‌బ్రైట్‌ వ్యాపారుల సంఘం నేత ఎక్కాడు. అతనితో పాటు ఓ బ్యాగు కూడా ఉంది. గురువారం ఉదయం క్రోంపేటలోని ఓ చర్చిలో అతని కూతురు వివాహం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
 
ఈ క్రమంలో బంగారం నగలు ఉన్న బ్యాగుతో ఆటోలో బయలుదేరిన సదరు వ్యాపారి శరవరణకుమార్ ఆటో ఎక్కాడు. కొద్ది సేపటికి తన ఇల్లు రాగానే మిగతా లగేజ్ అంతా తీసుకున్నాడు గానీ నగల బ్యాగ్ ఆటో మర్చిపోయి దిగి వెళ్లిపోయాడు. శరవణకుమార్ కూడా ఆటో చార్జీలు తీసుకుని వెళ్లిపోయాడు.
 
ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్‌బ్రైట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటో బ్యాక్ సీట్లో నగల సంచి ఉండడం గమనించిన 30 ఏళ్ల ఆటో డ్రైవర్‌ శరవణకుమార్‌ ఆ నగల బ్యాగు తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.
 
నగలను పోలీసులు సరి చూసి ఆల్‌బ్రైట్‌ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. ఆ బ్యాగులో 50 సవర్ల నగలు సురక్షితంగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు. ఆ నగల విలువ రూ.20లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగును ఓ వ్యక్తి తన ఆటోలో మరచిపోయాడని ఫలానా ప్రాంతంలో దిగాడని చెప్పాడు. అతని ఫోన్ నంబర్ నాదగ్గర లేకపోవటంతో పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments