Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలకు చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూపించే ప్రబుద్ధుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (17:48 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో జరిగింది. ఓ 68 యేళ్ళ కామాంధుడు... బాలికలకు చాక్లెట్లు ఇచ్చి వారికి అశ్లీల వీడియోలు చూపిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఓ చిన్నారి తన తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రబుద్ధుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 12 యేళ్ళ బాలిక తల్లి వృద్ధుల సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు. చెన్నై, ఎన్నూరుకు చెందిన పుష్పరాజ్‌ (68) అనే వ్యక్తి బాలికకు గేమ్స్‌ ఆడుకోమని తన సెల్‌ఫోన్‌ ఇచ్చేవాడు. పనిలోపనిగా చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూసేలా ప్రేరేపించేవాడు. 
 
ఈ క్రమంలో అశ్లీల వీడియోలను చూసేలా బాధితురాలిని ప్రేరేపించి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె నిందితుడు పుష్పరాజ్‌ను నిలదీశారు. నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలను స్టోర్‌ చేసినట్టు ఆమె గుర్తించారు. 
 
పుష్పరాజ్‌ నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మరో  ముగ్గురు బాలికలపైనా ఇలాగే వేధింపులకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం