తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.. సినీ లెజెండ్ కమల్ హాసన్. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్ వేసేశామని.. అవినీతికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం వుందన్నారు. భారత్‌లో కరోనా కేసులు కోటిని దాటిన నేపథ్యంలో తొలి విడతగా వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది.
ప్రస్తుతం రెండో విడతగా వృద్ధులు, రాజకీయ ప్రముఖులకు వ్యాక్సిన్ వేస్ ప్రక్రియ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు.
తన కోసమే కాకుండా.. ఇతరుల కోసం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు చెప్పారు. కరోనా నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిపోయిందని.. అవినీతిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్‌ను వేయాల్సి వుందని చెప్పారు. ఇందుకు వచ్చే నెల జరగబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.