Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాన్ని కాపాడిన చాట్‌జీపీటీ.. వ్యాధిని గుర్తించింది..

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (14:50 IST)
రోగుల ప్రాణాలకు కాపాడే వైద్యులను సాధారణంగా భగవంతుడితో పోలుస్తారు. తనకు అటువంటి పరిమితులేవీ లేవని నిరూపించిన చాట్‌జీపీటీ తాజాగా సుశిక్షితులైన వైద్యులు చేయలేనిది చేసి చూపించింది. 
 
శునకాన్ని ఉన్న వ్యాధి ఏంటో కచ్చితంగా గుర్తించి దాని ప్రాణాలు కాపాడింది. తన పెంపుడు శునకం ప్రాణాలు కాపాడిన చాట్‌జీపీటీకి ధన్యవాదాలు చెబుతూ కూపర్ అనే వ్యక్తి ప్రస్తుతం నెట్టింట్లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
 
తన పెంపుడు కూపర్ పెంచుకుంటున్న ఓ కుక్క ఇటీవల అనారోగ్యం పాలైంది. అకస్మాత్తుగా దాని ఆరోగ్యం మరింత దిగజారింది. తొలుత కుక్క ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించినా అంతలో దిగజారడం ప్రారంభించింది. 
అయితే..ఇందుకు కారణమేంటో వెటర్నరీ వైద్యులు గుర్తించలేకపోయారు. 
 
కూపర్ అనేక మందిని సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. దీంతో..ఆయన చివరకు చాట్‌జీపీటీని ఆశ్రయించారు. తన కుక్కకు ఉన్న రోగ లక్షణాలు, అప్పటివరకూ చేసిన వైద్య పరీక్షల తాలుకు ఫలితాలను చాట్‌బాట్ ముందుంచారు. 
 
అన్ని విషయాలను పరిశీలించాక కుక్కకు ఇమ్యూన్ మీడియేటెడ్ హీమోలైటిక్ అనీమియా వ్యాధి ఉన్నట్టు చాట్‌జీపీటీ అభిప్రాయపడింది. ఈ సమాచారంతో కూపర్ వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించారు. దీంతో..వైద్యుడికి కూడా శునకానికి ఉన్న సమస్య గురించి మరింత స్పష్టత వచ్చింది. ఆ తరువాత ఆయన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో కుక్క పూర్తిగా కోలుకుంది. ఈ విషయాలన్నీ వివరిస్తూ కూపర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments