Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ChappalChorPakistan : ట్విట్టర్‌లో ట్రెండ్

ఇపుడు 'చెప్పల్ చోర్ పాకిస్థాన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. చెప్పల్ చోర్ పాకిస్థాన్ (చెప్పుల దొంగ పాకిస్థాన్). గూఢచర్యం కేసులో పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసిన భ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:58 IST)
ఇపుడు 'చెప్పల్ చోర్ పాకిస్థాన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. చెప్పల్ చోర్ పాకిస్థాన్ (చెప్పుల దొంగ పాకిస్థాన్). గూఢచర్యం కేసులో పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసిన భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న జాదవ్‌ను చూసేందుకు ఆమె తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్‌‍లు ఇటీవల ఇస్లామాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి పట్ల పాకిస్థాన్ సైన్యం అనుసరించిన వైఖరిపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
భార్య చేతన్‌కుల్ తాళి, గాజులు తీయించి.. బొట్టు చెరిపేయించి నానా రభస చేసిన పాక్.. చివరికి ఆమె వేసుకున్న షూస్ కూడా తిరిగివ్వని విషయం తెలిసిందే. ఎందుకని అడిగితే అందులో ఏదో లోహంలాంటి వస్తువు ఉన్నది.. దానిని పరీక్షిస్తున్నామంటూ ఓ చెత్త కారణం చెప్పింది పాకిస్థాన్. 
 
ఈ ఘటన తర్వాత పాక్‌పై ఉన్న ద్వేషం కట్టలు తెంచుకున్నది. 'చెప్పల్ చోర్ పాకిస్థాన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దాయాది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంత జరిగినా చూస్తూ ఉండటం.. ఎందుకు ఆ దేశాన్ని మొత్తం నాశనం చేయండంటూ ట్వీట్లు చేస్తున్నారు.
 
అంతేనా, "మీది పేద దేశం అని తెలుసుగానీ మరీ ఇంత పేదది అని అనుకోలేదు.. పోష్‌గా ఉండే ఇండియన్ ప్రోడక్ట్స్ అంటే వారికి మోజెక్కువ.. అందుకే ఎవరో ఓ పోలీస్ అధికారి తన భార్య కోసం ఆమె చెప్పులను దొంగిలించి ఉంటాడు.. మా దగ్గర పాత చెప్పులు చాలా ఉన్నాయి.. అవన్నీ తీసుకొని ఆమె చెప్పులు ఆమెకు తిరిగివ్వండి" అంటూ పాకిస్థాన్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments