ఏపీ, తెలంగాణాలకు "స్థానిక" నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:36 IST)
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణాకు రూ.273 కోట్లు చొప్పున కేటాయించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.15,705 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,733 కోట్లు కేటాయించింది. ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు కేటాయిస్తుంటారు. ఇందులోభాగంగా, రూ.15,705.65 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. 
 
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి రూ.1,921 కేటాయించగా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రూ.వెయ్యికోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు లోపు మాత్రమే కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments