Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. సన్నాహాలు ప్రారంభించిన కేంద్రం

సెల్వి
శుక్రవారం, 7 జూన్ 2024 (20:07 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024ని అట్టహాసంగా నిర్వహించేందుకు సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించాయి. జూన్ 21ని "అంతర్జాతీయ యోగా దినోత్సవం"గా గుర్తించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తొమ్మిదవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఎన్ ప్రధాన కార్యాలయంలో 135 దేశాల నుండి ప్రతినిధులు హాజరైన ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.
 
యోగా వేడుకల్లో 135 దేశాలు పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యోగా డే సమీపిస్తున్న తరుణంలో, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖలోని మీడియా యూనిట్లు యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహనతో పాటు కామన్ యోగా ప్రోటోకాల్ (CYP) గురించి అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాల కార్యకలాపాలను నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాయి.
 
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రసార భారతి, న్యూ మీడియా వింగ్, ఇతరులతో సహా వివిధ మీడియా యూనిట్ల ద్వారా కీలక కార్యకలాపాలు ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆకాశవాణి యోగాను ఒక జీవన విధానంగా ప్రచారం చేయడానికి, ప్రజల మొత్తం శ్రేయస్సు కోసం కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments