Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడవసారి ప్రధానిగా మోదీ.. శ్రీవారి చిత్రపటంతో పవన్-బాబు సత్కారం

Advertiesment
Modi_Pawan_Babu

సెల్వి

, శుక్రవారం, 7 జూన్ 2024 (15:57 IST)
Modi_Pawan_Babu
ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఎన్నికయ్యారు. ఆయన మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ రోజు తర్వాత రాష్ట్రపతి ముందు దావా వేయబోతున్నాయి.
 
లోక్‌సభ నాయకుడిగా, ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన వెంటనే, నరేంద్ర మోదీని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మిత్రపక్షాలు ఘనంగా సత్కరించాయి. కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని నుదిటితో తాకి, గౌరవ సూచకంగా నమస్కరించారు. ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిస్తోంది.
 
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్‌లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా, లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ముచ్చటగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ కలిసి సత్కరించారు. నరేంద్ర మోదీ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటం ఇచ్చి.. పవన్, చంద్రబాబు గౌరవించారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆపై బాబు, పవన్ కలిసి మోదీకి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ కొత్త ఫీచర్.. ర్యాంకింగ్ ఫీచర్ గురించి తెలుసా?