Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శింగనమలలో పోరాడి గెలిచిన తెలుగుదేశం నాయకురాలు బండారు శ్రావణిశ్రీ

Sravani sri

ఐవీఆర్

, శుక్రవారం, 7 జూన్ 2024 (13:34 IST)
శింగనమల నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వైసిపిపై పోరాడి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ. పిన్న వయసులోనే తన రాజకీయ ప్రసంగాలతో, నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంలో వేసవి వడదెబ్బను సైతం లెక్కచేయక ప్రజాక్షేత్రంలో నిలిచి పర్యటనలు చేసారు.

దళిత నాయకురాలిగా శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రావణశ్రీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తాననీ, అన్ని సదుపాయాలతో ప్రజలు సంతోషంగా వుండేలా కృషి చేస్తానంటున్నారు శ్రావణిశ్రీ.  


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎస్ఎస్‌లో డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్.. వీడియో వైరల్