Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చల ద్వారానే సాగు చట్టాలకు పరిష్కారం : కేంద్ర మంత్రి

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (09:38 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పరిషోత్తం రూపాల పేర్కొన్నారు. రైతులతో చర్చలు కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంపై ఆయన పెదవి విరిచారు. 
 
అదేసమయంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు నిన్న భోగి మంటల్లో వేసి వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్‌ చెప్పారు. 
 
రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన రోజునే తాము లోహ్రీ (భోగి) పండుగను జరుపుకుంటామని రైతులు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 26న వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ శివారులో పరేడ్ నిర్వహించనున్నట్టు ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది.
 
మరోవైపు, రైతుల కష్టాలను చూసి చలించిన సుప్రీంకోర్టు ఈ సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు వీటిని అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంది. అదేసమయంలో సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments