Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓబీసీ - ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖారారు

Webdunia
గురువారం, 29 జులై 2021 (16:50 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కోర్సుల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వేషన్లను కేటాయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22 నుంచే వీటిని అమల్లోకి తీసుకునిరానుంది. 
 
మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు  వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.
 
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, వెనుకబడిన వర్గానికి , ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
దీంతో  ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది.
 
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందంటూ మోడీ ట్వీట్ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు పొందనున్నారన్నారు. మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments