Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఒకే దేశం.. ఒకే మార్కెట్ : మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (18:50 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అన్నంపెట్టే రైతన్నలను ఆదుకునేందుకు వీలుగా ఒకే దేశం - ఒకే మార్కెట్ ఏర్పాటు దిశగా ముందుకు అడుగువేసింది. అంటే, రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఎక్కడ ధర ఉంటే అక్కడ ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినించింది. ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు లభించింది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయి. ధాన్యాలు, పప్పులు, ఆయిల్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగించారు. ఈ విషయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments