Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు టీవీల్లో క్లాసులు చెబుతున్న కేరళ

ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు టీవీల్లో క్లాసులు చెబుతున్న కేరళ
, బుధవారం, 3 జూన్ 2020 (18:17 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. భారత్‌లో కొవిడ్ కేసుల పరిస్థితి రోజురోజూకూ పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత భారత ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. అలాంటి రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన కేరళ రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటోంది.
 
కరోనా వల్ల కలిగిన కష్టనష్టాలను అధిగమిస్తూనే కేరళ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతానికి కేరళలోని కొన్ని కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు, కళాశాలలు తెరిచే పరిస్థితి లేదు. విద్యార్థుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్పిస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులకు కనీసం ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదు. అటువంటి విద్యార్థుల కోసం వర్చువల్ క్లాసులను చెబుతోంది.
 
విద్యార్థులందరికీ విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేరళ విద్యా శాఖ ‘First Bell’ పేరుతో ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించింది. VICTERS TV ఛానల్ ద్వారా ఈ ఆన్‌లైన్ సెషన్‌లను ప్రసారం చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు వారాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 5.30 గంటలు వరకు క్లాసులు చెప్పిస్తోంది. కేబుల్ నెట్‌వర్క్ ఉన్నవారికి ఇంటర్నెట్‌ ద్వారా, డీటీహెచ్ ద్వారా రాష్ట్రమంతటా వర్చువల్ క్లాసులను ఉచితంగా విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో కొత్త పురుగు, రక్తం తాగుతోందట