Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీపుల్ ఛాయిస్ తరహాలో సీబీఎస్‌ఈ పరీక్షలు: కేంద్రం కసరత్తు

Webdunia
సోమవారం, 24 మే 2021 (18:01 IST)
కరోనా కష్టకాలంలో విద్యా సంవత్సరానికి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. గత యేడాది కాలంగా పాఠశాలలు తెరుచుకోలేదు. కేవలం ఆన్‌లైన్ తరగతులే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ యేడాది జరగాల్సిన 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర విద్యా శాఖ క‌స‌ర‌త్తులు చేస్తోంది. 
 
ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల‌తో కేంద్రం వ‌ర్చువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించారు. కేంద్ర ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సమావేశంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై ఓ సూచ‌న అంద‌రి దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
 
ఈ సూచ‌న మేర‌కు ఏ స్కూళ్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ఆ కేంద్రాల్లోనే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి.. కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌ క్వశ్చన్స్‌ విధానంలో పరీక్షలు నిర్వహించాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీనికి చాలా రాష్ట్రాలు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. 
 
ఈ నేప‌థ్యంలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. జులై 15, ఆగస్టు 26 మధ్య చేప‌ట్టాల‌ని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను జూన్‌ ఒకటవ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్లు స‌మాచారం. పూర్తిగా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
 
మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. దేశంలో పెరుగుతోన్న క‌రోనా నేథ్యంలో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలంటూ ఇప్ప‌టికే త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్ర‌ధానికి లేఖ‌లు రాసిన విష‌య తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments