Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణ ఘటన.. రెండో పెళ్లి చేసుకున్న పాపానికి..?

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (20:38 IST)
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న మ‌హిళ‌కు కుల పెద్ద‌లు దారుణ శిక్ష విధించారు. కుల పెద్ద‌ల ఉమ్మిని నాకాల‌ని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. అకోలా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(35)కు 2011లో వివాహ‌మైంది. 
 
కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌కు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన నాథ్ జోగి క‌మ్యూనిటీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేదు.
 
దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోద‌రితో పాటు బంధువుల‌ను కుల పెద్ద‌లు పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్ష విధిస్తున్న‌ట్లు తెలిపారు. అదేంటంటే.. కుల పెద్ద‌లంతా క‌లిసి అర‌టి ఆకుల‌పై ఉమ్మి వేస్తార‌ని, దాన్ని స‌ద‌రు మ‌హిళ నాకాల‌ని ఆదేశించారు. 
 
అంతే కాకుండా రూ. ల‌క్ష జ‌రిమానా వేశారు. ఈ శిక్ష‌పై తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత మ‌హిళ‌.. నిన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments