Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల కౌంటింగ్‌కు వెళ్లాలంటే కోవిడ్ నెగెటివ్ రిపోర్టు మస్ట్ : ఈసీ

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:42 IST)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే నెల రెండో తేదీన జరుగనుంది. వెస్ట్ బెంగాల్‌తో పాటు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల శాసనసభలకు ఈ ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌లో మాత్రం చివరి దశ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం (మే 2) కౌంటింగ్ జరగనుంది. ఇదేసమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు ఆంక్షలను విధించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్లోకి అడుగుపెట్టాలంటే... వారితో పాటు కరోనా నెగెటివ్ రిపోర్టును ఖచ్చితంగా తీసుకురావాలని తెలిపింది. 
 
లేదా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న పత్రాలను తీసుకురావాలని చెప్పింది. ఈమేరకు ఈసీ కొత్త ఉత్వర్వులను జారీ చేసింది. కౌంటింగ్ సెంటర్ల వెలుపల జనాలు గుమికూడరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
కాగా, అభ్యర్థులు, వారి ఏజెంట్లు 48 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టులను తీసుకురావాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే వీటిని సమర్పించాలని తెలిపింది.
 
మరోవైపు, కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎన్నికల ర్యాలీలకు ఈసీ అనుమతించడం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments