Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు కొత్త నిబంధనలు.. ఏప్రిల్ 1 నుంచి ప్రోటోకాల్ తప్పదు..

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (11:15 IST)
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.65లక్షల పరీక్షలు చేయగా.. 53,476 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది. కొత్తగా 26,490 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650కు చేరి.. రికవరీ రేటు 95.49శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 275 నమోదు కాగా.. బుధవారం 251 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,60,692కి చేరింది. 
 
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్‌ను పాటించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొత్త నియమాలు అమలు అవుతాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్య 70 శాతానికి పెంచాలన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతరాష్ట్ర రవాణపై ఎలాంటి ఆంక్షలు విధించరాదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments