Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి ప్రేమ దక్కలేదు... కిరాతకుడిగా మారి 33 మందిని చంపేశా...

తనకు తండ్రి ప్రేమ దక్కలేదనీ, అందుకే అత్యంత కిరాతకంగా మారి 33 మందిని చంపేసినట్టు ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సీరియల్ కిల్లర్‌ను ఆ రాష్ట్ర పోలీస

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:04 IST)
తనకు తండ్రి ప్రేమ దక్కలేదనీ, అందుకే అత్యంత కిరాతకంగా మారి 33 మందిని చంపేసినట్టు ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సీరియల్ కిల్లర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సీరియల్ కిల్లర్ పేరు ఆదేశ్ ఖమ్రా.
 
ఈయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో... 'నాకు తండ్రి ప్రేమ దక్కలేదు... అందుకే నేను కిరాతకుడిగా మారి 33 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లను హత్య చేశాను' అని చెప్పాడు. 'నాకు బాల్యంలో తండ్రి ప్రేమ లభించక పోగా, నన్నెవరూ పట్టించుకోలేదు. దీంతో పెరిగేకొద్దీ నాలో హింసాత్మక ప్రవృత్తి పెరిగింది' అని తెలిపాడు. 
 
కాగా, ఖమ్రా తండ్రి గులాబ్ ఖమ్రా భారతీయ సైన్యంలో ఓ సుబేదారుగా పని చేశారు. దీంతో ఆదేశ్‌ ఆలనాపాలనా అంతా ఆమె తల్లే చూసుకునేది. పైగా, ఎపుడో ఒకసారి ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఆదేశ్‌ను గులాబ్ పెద్దగా దగ్గరకు చేరదీసేవాడు కాదు. చిన్నచిన్న విషయాలకే కొట్టి ఇంట్లో నుంచి బయటకు విసిరి వేసేవాడు. ఇవన్నీ మనసులో నాటుకుని పోవడంతో ఆదేశ్ కిరాతకుడిగా మారిపోయాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments