మాల్యాకు ఎపుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు : అరుణ్ జైట్లీ

భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రక

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (13:20 IST)
భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రకటన వాస్తవ విరుద్ధమైనది. అది నిజాన్ని ప్రతిబింబించడం లేదు. 2014 నుంచి అతనికి తానెప్పుడూ కలిసేందుకు సమయం ఇవ్వలేదన్నారు.
 
కాబట్టి అతడు నన్ను కలిశాడన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ రాజ్యసభ సభ్యునిగా ఉండి అప్పుడప్పుడూ సభకు హాజరయ్యే మాల్యా.. నేను పార్లమెంట్ నుంచి నా కార్యాలయానికి వెళ్తుండగా పలుకరించాడు. నా వెంట వేగంగా నడిచి వస్తూ నేను రుణాల చెల్లింపునకు ఓ ఆఫర్‌ను ప్రకటించాను అని చెప్పాడు. 
 
మోసపూరిత సెటిల్‌మెంట్ గురించి అంతకుముందే తెలుసుకున్న నేను సంభాషణను కొనసాగించేందుకు అనుమతించలేదు. కనీసం అతడి చేతిలో ఉన్న కాగితాలను తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. బ్యాంకులకు రుణపడ్డ వ్యక్తిగా అతనికి నేను ఎప్పుడూ సమయం ఇచ్చింది లేదు అని అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments