Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:23 IST)
బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చే సూట్​కేసు​ సంప్రదాయానికి క్రితంసారి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకుని పార్లమెంట్​కు వచ్చారు. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేడు 2020-21 వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టింది. క్రితంసారి సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. 
 
బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?
బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఈ రోజు బడ్జెట్​ ప్రవేశపెట్టింది. క్రితం సారి సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

అయితే.. బడ్జెట్​ ప్రతులు తెచ్చే ఈ సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్​కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసా...?

ఫ్రెంచ్​ నుంచి వాడుకలోకి... బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. నలుపు నుంచి.. భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే శన్ముఖమ్​ చెట్టీ 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.

1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు. 1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు. 1970ల తర్వాతే.. ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా.. ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో వచ్చారు.

మన్మోహన్​ సింగ్​.. బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు. ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా... చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా నిలిచారు.

బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో.. సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం. మోదీ-1 హయాంలో.. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు. 2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు.

2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.

ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్​ సమయంలో సూట్‌కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్ధిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments